Aditya Ohm elimination: ఆదిత్య ఓం ఎలిమినేషన్ కన్ఫమ్.. బిగ్ బాస్ ట్విస్ట్ ఇదేనా!
on Oct 3, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయింది. ఇక ఈ వారం ఎన్నో ట్విస్ట్ లు, ఎన్నో టాస్క్ లతో కొనసాగుతుంది.
గతవాతం నాటి సండే ఎపిసోడ్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. నబీల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నిఖిల్, నైనిక, మణికంఠ ఈ వారం నామినేషన్ లో ఉండగా.. మిడ్ వీక్ లో ఎవరు బయటకు వెళ్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే నిన్నటిదాకా జరిగిన ఓటింగ్ లో నైనిక, ఆదిత్య ఓం లాస్ట్ లో ఉన్నారు. ఇక ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇప్పటికే జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే అందులో ఆదిత్య ఓం ఎలిమినేషన్(Aditya Ohm elimination) అయినట్టుగా తెలుస్తుంది.
ఆదిత్య ఓంకి ఇప్పుడిప్పుడే బయట ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ఈ సమయంలో ఎలిమినేషన్ అనేది అన్ ఫెయిర్. ఎందుకంటే అతను హౌస్ లో గుడ్ అటిట్యూడ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అతనికి తెలుగు క్లియర్ గా మాట్లాడటం రాదని, సరిగ్గా డిఫెండ్ చేసుకోలేడనేవి తన ఎలిమినేషన్ కి ప్రధాన కారణాలుగా నిలిచాయనే నిజం. అయితే ఆదిత్య ఓం ఎలిమినేషన్(Aditya Ohm elimination) అనేది ఇప్పటికే లీక్ అయింది. నేటి ఎపిసోడ్ లో అతని ఎలిమినేషన్ చూపిస్తారని తెలుస్తుంది.
Also Read